తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో దర్శకుడు శివ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కంగువ’. నవంబర్ 14న ఈ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ఆడియో లాంచ్కు డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 26న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మూవీ ఆడియో లాంచ్ ఈ నెల 18న జరపనున్నట్లు టాక్. ఇక ఈ మూవీ ఈ నెల 31న విడుదలవుతుంది.