»Icmr Said 73 Of People In The Country Have A Chance Of Diabetes And 65 Of People Have Diabetes
ICMR: దేశంలో 73% మందికి షుగర్, 65% మందికి ఉభకాయం వచ్చే ఛాన్స్!
ఇండియాలో 2040 నాటికి 73 శాతం మంది షుగర్(మధుమేహం), 65 శాతం మంది ఊభకాయం వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) నిర్వహించిన సర్వేలో తెలిపింది.
భారతదేశంలో డయాబెటిస్(diabetes) మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. నేషనల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడించాయి. ఊబకాయం, అధిక బరువు కారణంగా దేశంలో 73 శాతం మంది షుగర్(sugar disease) వ్యాధి బారిన పడే అవకాశం ఉందని తెలిపాయి. ఈ క్రమంలో దేశంలోని 600 ప్రాంతాల్లో దాదాపు 10 వేల మందిని సర్వే చేయగా..ఈ వివరాలు తెలిశాయని ఈ సంస్థలు ప్రకటించాయి. మరోవైపు దీర్ఘకాలక వ్యాధులపై జరిగిన సర్వేలో ఇదే మొదటిదని ప్రకటించాయి. ఇంకోవైపు ఈ అంశంపై పార్లమెంటులో కూడా చర్చ కొనసాగింది.
నేషనల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) రాష్ట్రాలవారీగా ఈ వ్యాధి ప్రాబల్యాన్ని అంచనా వేసినట్లు తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య మధుమేహం వ్యాప్తిలో చాలా తేడాలు ఉన్నట్లు పేర్కొంది. బీహార్లో 4·3%, పంజాబ్లో 10·0% , మిజోరంలో 6·0%, త్రిపురలో 14·7% ఇలా పలు రాష్ట్రాల్లో ఒక్కో విధంగా షుగర్ వ్యాధి వ్యాప్తి ఉన్నట్లు ప్రకటించింది. మరోవైపు మధుమేహం వ్యాధి తీవ్రత పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రభావం తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం మొత్తంగా 34 శాతం మంది రక్తపోటు వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు ప్రకటించాయి. మరోవైపు ఈ భాధితుల్లో ఎక్కువగా పురుషులే ఉన్నారని తెలిపాయి. 2019లో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి దాదాపు 61 లక్షల మంది మృతి చెందినట్లు సర్వే ద్వారా తేలినట్లు వెల్లడించాయి. వీటిలో మధుమేహం కారణంగా మృతి చెందిన వారు 1.70 లక్షల మంది ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు దేశంలో 65 శాతం మరణాలకు దీర్ఘకాలిక వ్యాధులే(long term diseases) కారణమని స్పష్టం చేసింది. దీంతోపాటు ఇండియాలో పోషకాహార లోపం కూడా ఉన్నట్లు తెలిపింది. ఇండియాలో 98.4 శాతం మంది సరిపడా కూరగాయాలు, పండ్లు తినడం లేదని వెల్లడించింది. ఇంకోవైపు ఈ సర్వేలో పాల్గొన్న 40 శాతం మందికిపైగా తాము శారీరకంగా శ్రమ చేసే పనులు చేయడం లేదని చెప్పినట్లు ఈ సర్వే తెలిపింది. ఈ క్రమంలో 2040 నాటికి దేశంలో ఊభకాయులు పెరిగే అవకాశం ఉందని, దీంతోపాటు షుగర్ వ్యాధి కూడా వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించాయి.