TG: HYDలో సీఎం రేవంత్‌రెడ్డిని అడోబ్ CEO శంతను నారాయణ్ కలిశారు. తెలంగాణ రైజింగ్ బోర్డు సభ్యుడిగానూ శంతను కొనసాగుతున్న నేపథ్యంలో గ్లోబల్ ట్రెండ్స్, కొత్త అవకాశాలపై చర్చించారు. ఉద్యోగాలపై AI ప్రభావం, గ్రీన్ ఎనర్జీ, ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలపై మాట్లాడారు. ఏఐని సమర్థంగా వినియోగించుకునే విషయంపై రేవంత్ చర్చించినట్లు సమాచారం.
Tags :