»Nepotism In Tollywoodrana And Nani Are Come Together To Show
nepotism in tollywood:షోకు రానా, నాని రావడానికి కారణం అదే: స్మిత
టాపిక్స్ (topics) బట్టి నిజం విత్ టాక్ షోకి గెస్టులను ఆహ్వానించామని స్మిత తెలిపారు. తెలుగు సినిమాల్లో 'నెపోటిజం' (nepotism) గురించిన టాపిక్ కోసమే రానా (rana), నానీలను (nani) ఇద్దరినీ ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని వివరించారు.
nepotism in tollywood:‘నిజం విత్ స్మిత’ (nijam with smitha) టాక్ షోతో సోనీ లివ్‌లో ప్రారంభమైంది. ఫస్ట్ ఇంటర్వ్యూను మెగాస్టార్ చిరంజీవితో (chiranjeevi) చేశారు. ఎక్కడ ప్రస్తావించని కొన్ని విషయాలను టాక్ షోలో చెప్పారు చిరంజీవి. షో గురించి హోస్ట్ స్మిత (smitha) మాట్లాడారు. ఈ షోను కరోనా (covid) కన్నా ముందే చేయాలని అనుకున్నామని వివరించారు. ఆ తరువాత ఏర్పడిన పరిస్థితుల వల్ల ఆలస్యం అయ్యిందన్నారు. ఫస్ట్ సీజన్‌కి సంబంధించి షూటింగ్ గత ఏడాదిలో చేశామని తెలిపారు. టాక్ షోలో ఎవరినేం అడిగితే ఏమనుకుంటారోనని భయపడలేదన్నారు. వారు కూడా ఫలానా ప్రశ్నలు ఉండకూడదని చెప్పలేదని వివరించారు. షూటింగ్ తరువాత కొన్ని ప్రశ్నలు తీసేయమని ఎవరూ అనలేదని స్మిత చెప్పారు. టాక్ షో సీరియస్‌గా ఉంటుందేమోనని అనుకున్నానని.. కానీ సరదాగా సాగిందని చెప్పారు.
టాపిక్స్ బట్టి గెస్టులు
టాపిక్స్ (topics) బట్టి షోకి గెస్టులను ఆహ్వానించామని స్మిత తెలిపారు. తెలుగు సినిమాల్లో ‘నెపోటిజం’ (nepotism) గురించిన టాపిక్ కోసమే రానా (rana), నానీలను (nani) ఇద్దరినీ ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. ఒకరు బలమైన సినిమా నేపథ్యం నుంచి వచ్చినవారు .. మరొకరు ఎలాంటి నేపథ్యం లేని వారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అందువల్లే వారిని పిలవడం జరిగిందని అన్నారు. ఆ తరువాత ఎపిసోడ్స్‌లో మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు (chandrababu naidu), సీనియర్ నటి రాధిక (radhika), నటి సాయిపల్లవి (sai pallavi), దర్శకులు అనిల్ రావిపూడి (anil ravipudi), దేవ కట్టా (deva katta), సందీప్ రెడ్డి (sandeep reddy), హీరోలు అల్లరి నరేశ్ (allari naresh), అడివి శేష్ (adivi sesh)తో ఫస్ట్ సీజన్ స్ట్రీమింగ్ కానుందని స్మిత (smitha) తెలిపారు.
చిరుతో ఫస్ట్ ఎపిసోడ్
ఈ నెల 10వ తేదీన చిరంజీవి (chiranjeevi) ఫస్ట్ ఎపిసోడ్ సోని లీవ్‌లో స్ట్రీమ్ అయ్యింది. ‘కష్టేపలి అప్ వర్డ్ మొబిలిటీ’ అనే పేరు పెట్టారు. మీ అనుభవంలో అవమానాలు అని అడగగా.. తనకు జగిత్యాలలో అవమానం జరిగిందని చెప్పారు. ముందు పూల వర్షం కురిసిందని.. ఆ తర్వాత కోడిగుడ్లతో దాడి జరిగిందని చెప్పారు. వరప్రసాద్ నుంచి మెగాస్టర్ అయ్యే సిచుయేషన్ ఉందా అని మరో ప్రశ్న వేశారు స్మిత. ఇలా పలు అంశాలపై ఇంటర్య్వూ జరిగింది.
వెన్నుపోటు..
ఫస్ట్ వీడియోను సోనీ లీవ్ చాలా రోజుల క్రితమే విడుదల చేసింది. నిజం విత్ స్మిత అనే టాక్ షోకు నిజం నిర్భయంగా అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. చంద్రబాబును (chandrababu) మాటకు ముందు వెన్నుపోటు అని అంటారు అనగా.. తెలంగాణ సీఎం (telangana cm) కూడా భాగస్వామి అని సమాధానం ఇచ్చారు. చరణ్ (charan) సినిమాను కోటి మంది చూశారు.. చూసినవారే కదా నెపోటిజాన్ని ఎంకరేజ్ చేసింది అని నాని అన్నారు. ఇదీ రెండో ఎపిసోడ్ కానుంది. సినిమా వల్ల సమాజం చెడిపోతుందని తప్పు అని దర్శకుడు దేవ కట్టా (deva katta) సమాధానం ఇచ్చారు. అసభ్య పదజాలంతో దూషించడం ఏంటీ అని సాయి పల్లవి (sai pallavi) గొంతెత్తారు. అప్పట్లో హీరోయిన్లకు విలువ ఉండేదని రాధిక (radhika) చెప్పుకొచ్చారు.
అన్ స్టాపబుల్
తెలుగులో ‘ఆహా’లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ ఓ రేంజ్లో హిట్ అయ్యింది. పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన రెండు షోలతో సెకండ్ సీజన్ కూడా ముగిసింది. దానికి ధీటుగానే సోని లివ్ మరో టాక్ షో తీసుకొచ్చింది. గాయనీ స్మిత హోస్ట్‌గా వ్యవహరించారు.