»Bread Maangoge Chuha Denge Man Finds A Live Rat Inside Packet Of Bread Delivered By Blinkit
Bread Maangoge, Chuha Denge’: : ఆన్ లైన్ లో బ్రెడ్ ఆర్డర్ చేస్తే… ఎలుక ఫ్రీగా వచ్చింది…!
Bread Maangoge, Chuha Denge':
ఇంట్లోకి ఎవైనా కావాలంటే షాప్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. ఇంట్లో కూర్చొని ఫోన్ లో నొక్కితే చాలు... 15-20 నిమిషాల్లో ఆర్డర్ చేసిన సరుకులన్నీ కళ్లముందుకు వచ్చేస్తాయి. ఇలా సరుకులు డెలివరీ చేసే యాప్స్ చాలానే ఉన్నాయి. అందులో బ్లింక్ ఇట్ కూడా. కాగా... ప్రస్తుతం ఈ బ్లింక్ ఇట్ యాప్ నుంచి ఆర్డర్ చేసిన ఓ ఫుడ్ ఐటెమ్ వివాదానికి కారణమైంది. ఓ వ్యక్తి ఈ యాప్ లో బ్రెడ్ ఆర్డర్ చేస్తే... దాంతో పాటు... ఓ ఎలుక కూడా రావడం గమనార్హం. దీంతో సదరు వినియోగదారుడు దానిని సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది.
ఇంట్లోకి ఎవైనా కావాలంటే షాప్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. ఇంట్లో కూర్చొని ఫోన్ లో నొక్కితే చాలు… 15-20 నిమిషాల్లో ఆర్డర్ చేసిన సరుకులన్నీ కళ్లముందుకు వచ్చేస్తాయి. ఇలా సరుకులు డెలివరీ చేసే యాప్స్ చాలానే ఉన్నాయి. అందులో బ్లింక్ ఇట్ కూడా. కాగా… ప్రస్తుతం ఈ బ్లింక్ ఇట్ యాప్ నుంచి ఆర్డర్ చేసిన ఓ ఫుడ్ ఐటెమ్ వివాదానికి కారణమైంది. ఓ వ్యక్తి ఈ యాప్ లో బ్రెడ్ ఆర్డర్ చేస్తే… దాంతో పాటు… ఓ ఎలుక కూడా రావడం గమనార్హం. దీంతో సదరు వినియోగదారుడు దానిని సోషల్ మీడియాలో షేర్ చేయగా… అది కాస్త వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నితిన్ అరోరా అనే వ్యక్తి ఇటీవల బ్లింక్ ఇట్ యాప్ నుంచి బ్రెడ్ ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ చేసిన కాసేపటికే అది ఇంటికి వచ్చింది. వెంటనే దానిని తిందామని తెరచి చూసి షాకయ్యాడు. ఎందుకంటే… ఆ బ్రెడ్ ప్యాకెట్ లో ఓ బతికున్న ఎలుక ఉండటం గమనార్హం. దానిని తీసుకువచ్చిన డెలివరీ బాయ్ కూడా దానిని గమనించకపోవడం విశేషం. దీంతో… నితిన్ అరోరా తన అనుభవాన్ని నెట్టింట పంచుకోగా.. అది కాస్త వైరల్ గా మారింది.
అయితే… అతని ట్వీట్ కి బ్లింక్ ఇట్ వెంటనే స్పందించింది. తమ కష్టమర్ కి ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వాలని తాము అనుకోలేదని… అతను ఆర్డర్ చేసిన ఆర్డర్ ఐడీ షేర్ చేస్తే…. దీనిని తాము పరిశీలిస్తామని బ్లింక్ ఇట్ అధికారి స్పందించడం గమనార్హం. ఏది ఏమైనా ఈ సంఘటన చాలా మంది నెటిజన్లను భయపెట్టేసింది. ఇలా ఆన్ లైన్ లో ఆర్డర్ చేయడం కంటే.. షాప్ కి వెళ్లి కొనుక్కోవడమే ఉత్తమమని ఫీలౌతూ కామెంట్స్ చేస్తున్నారు.