»Revanth Reddy Said Electricity Crisis In Telangana Basheerbagh Movement Once Again
Revanth Reddy: తెలంగాణలో విద్యుత్ సంక్షోభం..మళ్లీ బషీర్ బాగ్ ఉద్యమం రావాలి
తెలంగాణలో విద్యుత్ కోతల నేపథ్యంలో మరోసారి బషీర్ బాగ్ ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సమక్షంలో వేల కోట్ల రూపాయల విద్యుత్ స్కాం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.
revanth said Telangana Basheerbagh movement once again
తెలంగాణ(telangana)లో మళ్లీ విద్యుత్ కోతలు(power cuts) జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) గుర్తు చేశారు. మరోవైపు రైతులకు 24 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ క్రమంలో కేసీఆర్(kcr) 24 గంటల కరెంట్ ఇవ్వడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. తెలంగాణలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్నారు. రాష్ట్రంలో చేసే పనుల కంటే కేసీఆర్ చెప్పే గొప్పలే ఎక్కువగా ఉంటాయని..ఈ కరెంట్ కోతలు, 24 గంటల విద్యుత్ విషయంలో మరోసారి రుజువైందని రేవంత్ అన్నారు. ఇక కేసీఆర్ టైం అయిపోయిందని..తనను ఫాం హౌంస్ కే పరిమితం చేయాలని ఎద్దేవా చేశారు.
కోట్ల రూపాయల స్కాం
కేసీఆర్ దోపిడీ కారణంగా రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు నష్టపోయాయని రేవంత్ ఆరోపించారు. కరెంట్ కొనుగోళ్లలో కోట్ల రూపాయల స్కాం జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ కారణంగా జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కం వంటి సంస్థలు దాదాపు 50 వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నట్లు తెలిపారు. అటు చత్తీస్ గఢ్ రాష్ట్రంతో కూడా తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందంలో కూడా బొక్కలు ఉన్నాయని రేవంత్ ఆరోపించారు.
మళ్లీ వీరికే పదవులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత విద్యుత్ స్కాంలపై విచారణ జరిపిస్తామని రేవంత్ తెలిపారు. కేసీఆర్ చెప్పిన ప్రతి పనికి ప్రస్తుతం సీఎండీలు ప్రభాకర్ రావు(cmd prabhakar rao), రఘమారెడ్డి, గోపాల్ రావులు తల ఊపుతున్నారని…ఎక్కడంటే అక్కడ సంతకాలు కూడా పెడుతున్నారని గుర్తు చేశారు. వీరు 15 ఏళ్ల క్రితమే రిటైర్ కాగా..మళ్లీ వీరికే పదవులు ఇచ్చి ఇష్టం వచ్చిన పనులు కేసీఆర్ చేయించుకుంటున్నారని రేవంత్ విమర్శించారు.
బషీర్ బాగ్ ఉద్యమం
ఈ క్రమంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి(revanth reddy) డిమాండ్ చేశారు. అయినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తాము రోడ్లపైకి వచ్చిన నిరసన తెలుపుతామని అన్నారు. ఆ తర్వాత సబ్ స్టేషన్లను సైతం ముట్టడిస్తామని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మరోసారి బషీర్ బాగ్(Basheerbagh movement) లాంటి ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. అప్పట్లో విద్యుత్ కోతలపై చేసిన బషీర్ బాగ్ ఉద్యమం కారణంగా ఆరోజు ప్రభుత్వం కూలిపోయిందని గుర్తు చేశారు. ఇక కమ్యూనిస్టులు దోపిడీ దారుల వర్గం వైపు ఉంటారో లేదో ప్రశ్నించే వారి వైపు ఉంటారో నిర్ణయించుకోవాలని సూచించారు.
ప్రజలపై అధిక భారం
మరోవైపు వినియోగదారులు ఏసీడీ చార్జీలు(acd charges) అసలు చెల్లించకూడదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ చార్జీల కారణంగా ప్రజలపై అధిక భారం పడుతుందన్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరెంట్ బిల్లులు రావడంతో అనేక మంది వినియోగదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుర్తు చేశారు. ఈ దోపిడీకి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు వాటా ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు. అయితే ఈర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు మంత్రి హరీశ్ రావు సోదరుడు అయినందునే చట్టంలో నిబంధన పెట్టారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీడీ చార్జీలు రద్దు చేస్తామని వెల్లడించారు. ఇంకోవైపు యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని రేవంత్ అన్నారు.