వైశాలిని కిడ్నాప్ చేయడంతో పాటు తన కుటుంబ సభ్యులపై నవీన్ రెడ్డి, ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు. దీంతో అతడితో పాటు మరో 40 మందిపై ఆదిబట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. వైశాలిని కిడ్నాప్ చేయడమే కాదు
Vaishali – Naveen Reddy Case : కొన్ని రోజుల కింద హైదరాబాద్ లో వైశాలి కిడ్నాప్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కేసు మరో టర్న్ తీసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ ను నమోదు చేశారు. వంద మందితో కలిసి వైశాలి ఇంటికి వెళ్లి తన పెళ్లిని ఆపి మరీ.. ఆమెను నిందితుడు నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. గత సంవత్సరం డిసెంబర్ 9న ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో వెంటనే నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో అతడిపై 5 కేసులు నమోదు చేశారు.
వైశాలిని కిడ్నాప్ చేయడంతో పాటు తన కుటుంబ సభ్యులపై నవీన్ రెడ్డి, ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు. దీంతో అతడితో పాటు మరో 40 మందిపై ఆదిబట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. వైశాలిని కిడ్నాప్ చేయడమే కాదు.. ఆమె పేరుతో నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేసి వైశాలి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం, పోలీసులను తప్పు దోవ పట్టించడం లాంటి అభియోగాల కింద నవీన్ రెడ్డిపై కేసులను నమోదు చేశారు.
Vaishali – Naveen Reddy Case : నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన రాచకొండ సీపీ
తాజాగా నవీన్ రెడ్డిపై రాచకొండ సీపీ పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇప్పటికే నవీన్ రెడ్డిపై ఆదిబట్ల పీఎస్ లో ఐదు కేసులు నమోదయ్యాయి. నవీన్ రెడ్డి వల్ల తమ కూతురుకు ప్రాణ ముప్పు ఉందని వైశాలి తల్లిదండ్రులు ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నవీన్ రెడ్డిపై పోలీసులు తాజాగా పీడీ యాక్ట్ నమోదు చేశారు.