NLG: హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్లో దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న జర్నలిస్టు చిలుక ప్రవీణ్‌ను గురువారం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యేలు కిశోర్ కుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి, రాకేష్ రెడ్డి ఉన్నారు.