AP: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డయేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. దమ్మలవీధి, మంగువారితోట, కాకివీధి, గుడివీధిలో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. మెరుగైన పారిశుధ్యం కోసం కార్పొరేషన్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తాగునీటి సరఫరాను పైపులైన్ ద్వారా అధికారులు నిలుపుదల చేశారు. నాలుగు ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నారు. లక్షణాలు ఉన్నవారికి వైద్య సేవలు అందిస్తున్నారు.