AP: రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెండ్పై ప్రభుత్వం వేటు వేసింది. కల్తీ పాల బాధితులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సత్యనారాయణను సస్పెన్షన్ చేశారు. కొత్త సూపరింటెండెంట్‌గా డాక్టర్ కెనడి నియామకమయ్యారు. అయితే, రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంలో ఐదుగురు మరణించారు. 8 మంది బాధితులు వెంటిలేటర్‌పై ఉన్న విషయం తెలిసిందే.