AP: ఎన్డీయే కూటమిలోని బాబు లడ్డూ విశిష్టతను కించపరుస్తుంటే బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదని మాజీ సీఎం జగన్ నిలదీశారు. మతం పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పు చేతల్లో ఉండే అధికారులతో సిట్ వేశారని అన్నారు. చంద్రబాబు పాపాలు ప్రజలపై పడకుండా వైసీపీ నేతలు తమ ఊళ్లలో ప్రత్యేక పూజలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు.