సత్యసాయి: తలుపుల తహశీల్దార్గా రెడ్డి శేఖర్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది పూలమాలలు వేసి స్వాగతం పలికి సన్మానించారు. గతంలో ఆయన ఆమడగూరు మండలం డిప్యూటీ తహశీల్దార్ విధులు నిర్వహిస్తూ తలుపులకు బదిలీపై వచ్చారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి మండలంలో నెలకొన్న సమస్యలు, పరిపాలన గురించి తెలుసుకున్నారు.