GNTR: గుంటూరు ఎక్సైజ్ సూపరిండెంట్‌గా వి. అరుణకుమారి బ్రాడీపేటలోని కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలలో బాపట్ల ఈఎస్‌గా ఉన్న ఆమెను గుంటూరుకు నియమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మద్యం అక్రమ రవాణా, గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. ఆ శాఖ సీఐలు, ఎస్సైలు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు.