MHBD: జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారంలో మంత్రాల నెపంతో వ్యక్తిని హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మల్లం యాకయ్య మంత్రాలు చేశాడనే అనుమానంతో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హత్య చేశాడు. తనకు మంత్రాలు చేశాడని, అందుకే చంపానని గ్రామస్థులకు చెప్పాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.