NDL: గ్రామాలలో ఎటువంటి గొడవలు సృష్టించకూడదని ఆత్మకూరు డీఎస్పీ రామంజి నాయక్ అన్నారు. శుక్రవారం నందికొట్కూరులోని రూరల్ సర్కిల్ కార్యాలయం వద్ద పీరుసాహెబ్ పేటకు చెందిన గ్రామస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగచేయరాదని అన్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, మిడ్తూరు ఎస్సై పాల్గొన్నారు.