Ashwin Record: కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్
టీమిండియా స్పిన్నర్ అశ్విన్(Ashwin) మరో రికార్డు సాధించాడు. టెస్టుల్లో 450 వికెట్లను పడగొట్టాడు. దీంతో అశ్విన్(Ashwin) మరో మైలురాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న భారత్ స్పిన్నర్‌గా అశ్విన్(Ashwin) రికార్డు నెలకొల్పాడు. అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు.
Ashwin Record: టీమిండియా స్పిన్నర్ అశ్విన్(Ashwin) మరో రికార్డు సాధించాడు. టెస్టుల్లో 450 వికెట్లను పడగొట్టాడు. దీంతో అశ్విన్(Ashwin) మరో మైలురాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న భారత్ స్పిన్నర్‌గా అశ్విన్(Ashwin) రికార్డు నెలకొల్పాడు. అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. 89 టెస్టుల్లోనే అశ్విన్ ఈ ఘనత సాధించడం విశేషం.
టెస్టుల్లో ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్ స్పిన్నర్‌గా అశ్విన్(Ashwin) రికార్డుకెక్కాడు. ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే టెస్టుల్లో అత్యంత వేగంగా 450 వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్(Ashwin) రెండో స్థానంలో నిలిచాడు. అశ్విన్(Ashwin) కంటే ముందుగా ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan) ఉన్నాడు. శ్రీలంక మాజీ స్పిన్నర్ అయిన ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan) తన 80వ టెస్టు మ్యాచులోనే 450 వికెట్లను పడగొట్టాడు. అంతేకాకుండా టెస్టుల్లో 3 వేల పరుగులు సాధించి 450 వికెట్లు తీసిన ఏకైక ఆసియా ప్లేయర్‌గా నిలిచాడు.
ఆస్ట్రేలియా(Australia), భారత్ తలపడుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ తన 450వ వికెట్‌ను పడగొట్టాడు. ఆస్ట్రేలియా(Australia) వికెట్ కీపర్ అలెక్స్ కేరీ వికెట్ పడగొట్టడంతో అశ్విన్(Ashwin) ఈ ఘనతను సాధించాడు. నిజానికి తన తొలి 10 ఓవర్లలో అశ్విన్(Ashwin)కు వికెట్ దక్కనే లేదు. ఆ తర్వాత 11వ ఓవర్లో కేరీని అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
R Ashwin strikes again!
Pat Cummins is caught at first slip by Virat Kohli.
ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. దీంతో జడేజాతో కలిసి అశ్విన్(Ashwin) చెలరేగిపోయాడు. టీమిండియా స్పిన్నర్ల దూకుడుకు ఆస్ట్రేలియా(Australia) కష్టాల్లో పడింది. అంతకుముందు తొలి రోజు ఉదయమే ఇండియన్ పేసర్లు అయిన సిరాజ్, షమి ఆస్ట్రేలియా(Australia)ను గట్టి దెబ్బ తీశారు. సిరాజ్ తాను వేసిన తొలి బంతికే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసి టీమిండియాలో ఉత్సాహాన్ని నింపాడు. ఆ తర్వాతి ఓవర్లో షమి వేసిన బాల్ వార్నర్ ఆఫ్ స్టంప్ ను లేపేయడంతో ఆసీస్ 2 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఓ దశలో ఆస్ట్రేలియా(Australia) బ్యాటర్లు స్మిత్, లబుషేన్ మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించి తమ జట్టు స్కోరును ముందుకు నడిపారు.
That 𝐌𝐎𝐌𝐄𝐍𝐓 when @imjadeja let one through Steve Smith's defence! 👌👌