NLR: ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన ఘటన పెళ్లకూరు మండలం చిల్లకూరు జాతీయ రహదారి వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి నుంచి నాయుడు పేటకు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన క్లీనర్ కార్తీక్(23) మృతి చెందగా డ్రైవర్ వినోద్ బాబు, మరో క్లీనర్ కునాల్ కుమార్కు గాయాలయ్యాయి.