జార్ఖండ్ బొకారోలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. తుప్కాడిహ్.. రాజబెరా సెక్షన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పి రెండుగా విడిపోయింది. దాని రెండు వ్యాగన్లు బోల్తా పడ్డాయి. దీంతో డౌన్‌లైన్ ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. రైలు అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పట్టాలు తప్పిన వ్యాగన్లును పక్కకు తొలగించి ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.