మెగాస్టార్ చిరంజీవి నటించిన పొలిటికల్ డ్రామా ‘గాడ్ ఫాదర్’ దసరాకు రిలీజ్ కాబోతోంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా.. మళయాళ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్‌గా తెరకెక్కింది. దాంతో ‘ఆచార్య’ ఫ్లాప్‌ను ‘గాడ్ ఫాదర్’ చెరిపేస్తుందని అంటున్నారు. అందుకే ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగాభిమానులు. పైగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించడంతో.. అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ సింగిల్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. పొలిటికల్ డైలాగ్‌తో పాటు.. ఆకాశ వీధుల్లో విహరిస్తూ ‘ఇన్ ద క్లౌడ్స్ విత్ గాడ్ ఫాదర్’ అంటూ శ్రీముఖితో చిట్ చాట్ చేసి హైప్ క్రియేట్ చేస్తున్నారు మెగాస్టార్. ఇక ఇప్పుడు దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలిపాడు. గాడ్ ఫాదర్ యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుందని.. సెన్సార్ టాక్ గురించి సాలిడ్ పోస్ట్ చేశాడు. సినిమా చూసాక సెన్సార్ సభ్యులు అమేజింగ్‌గా ప్రశంసలు అందించారని చెప్పుకొచ్చాడు. సెన్సార్ బోర్డ్ నుంచి మంచి స్పందన వచ్చిందని.. అక్టోబర్ 5న ఆడియెన్స్ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. దాంతో గాడ్ ఫాదర్ పై హిట్ పక్కా అంటున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరపబోతున్నారు. సెప్టెంబర్ 28న అనంతపూర్‌లో.. మాసివ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి గాడ్ ఫాదర్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.