రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడు కేశవ్ మూర్తికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మరో ఇద్దరు నిందితులు కార్తీక్, నిఖిల్‌కు బెంగళూరు సెషన్స్ కోర్టు బెయిల్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అంతేకాకుండా వారిపై హత్యానేరం ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. కాగా ఈ హత్య కేసులో నటుడు దర్శన్ తూగుదీప, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ సహా మొత్తం 17 మంది నిందితులు రాష్ట్రంలోని వివిధ జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.