క్రికెట్లో ఎవరు బెస్ట్ ఫాస్ట్ బౌలర్ అనే దానిపై ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. టీమిండియా పేసర్ బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్ ఫాస్ట్ బౌలరని కొనియాడాడు. నవంబర్ 22 నుంచి జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ విజయం సాధించాలంటే బుమ్రానే కీలకమన్నాడు. బంతి కొత్తదైనా, పాతదైనా బుమ్రా ఎంతో నైపుణ్యంతో బౌలింగ్ చేస్తాడని అన్నాడు. ఏ ఫార్మాట్లో అయిన అతనిని ఎదుర్కోవడం సవాలేనని పేర్కొన్నాడు.