మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన ‘వాల్తేరు వీరయ్య’.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న వచ్చిన వీరయ్య.. సంక్రాంతి విన్నర్‌గా నిలిచాడు. చిరుని వింటేజ్ లుక్‌లో చూపించి.. మెగా కిక్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. దాంతో మెగాస్టార్ కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఓవర్సీస్లో అయితే వీరయ్య ఆధిపత్యం క్లియర్‌గా కనిపించింది. ఈజీగా 2.5 మిలియన్ డాలర్లను కొల్లగొట్టేసింది. దాంతో ఆచార్య ఫ్లాప్ తర్వాత మెగా దాహం తీరినట్టే. ఇక ఈ సినిమా రిలీజ్ అయి మూడు వారాలు కావొస్తుంది. అయితే మరో మూడు వారాల్లో వాల్తేరు వీరయ్య ఓటిటిలోకి రాబోతున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి.. ఎప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మెగాఫ్యాన్స్. థియేటర్‌కు వెళ్లలేని వారు.. మరోసారి తమ అభిమాన హీరోని ఒకటికి రెండు చూసుకోవడానికి.. వీరయ్య ఓటిటి డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యలో ఫలాన రోజు డిజిటల్ స్ట్రీమింగ్కు రాబోతోందని ప్రచారం జరిగినా.. ఎట్టకేలకు అఫిషీయల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమా ఓటిటి రైట్స్‌ను ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.. దాంతో ఫిబ్రవరి 27 నుంచి ఓటిటిలో అందుబాటులోకి రాబోతున్నట్టుగా అధికారంగా ప్రకటించారు. అంటే 7 వారాల్లోపే వాల్తేరు వీరయ్య డిజిటల్ స్ట్రీమింగ్కు రానుందని చెప్పొచ్చు. మరి బాక్సాఫీస్ బద్దలు కొట్టిన వీరయ్య, ఓటిటిలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటాడో చూడాలి.