కల్కి సినిమాపై ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు మండిపడ్డారు. ‘భారతంలో ఉన్నది వేరు.. సినిమాలో చూపించింది వేరు. భారతంలో కర్ణుడినే అశ్వత్థామ కాపాడాడు. అశ్వత్థామను కర్ణుడు ఒక్కసారి కూడా కాపాడలేదు. ఆ అవసరం లేదు’ అని వివరించారు. కాగా, గతంలో పుష్ప సినిమాపై కూడా గరికపాటి ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.