దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘ఈవెంట్ రద్దు చాలా బాధాకరం. అవకాశం దొరికనప్పుడు ఫ్యాన్స్‌తో సమయం గడపాలనుకుంటా. దేవర సినిమా గురించి మేం పడ్డ కష్టం చెబుదామనుకున్నా. నిర్మాతలు, ఈవెంట్ నిర్వాహకులను తప్పుపట్టొద్దు. ఫ్యాన్స్ కంటే నేను ఎక్కువగా బాధపడుతున్నా. అభిమానుల ప్రేమకు జన్మ జన్మలు రుణపడి ఉంటా’ అని పేర్కొన్నారు.