గిన్నిస్ రికార్డు తానెప్పుడు అసలు ఊహించలేదని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ సమక్షంలో గిన్నిస్ బుక్ రికార్డు పత్రం చిరంజీవి అందుకున్నారు. తాను ఊహించని గౌరవం ఇవాళ దక్కిందని..నటన కంటే ముందే డ్యాన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చానన్నారు. చిన్నప్పుడు రేడియోల్లో వచ్చే పాటలకు డ్యాన్స్ వేసేవాడినన్నారు. కాగా 150కి పైగా సినిమాల్లో అన్ని రకాల డ్యాన్సులతో అలరించిన ఏకైక నటుడిగా గిన్నిస్ రికార్డు సాధించారు.