భద్రాద్రి కొత్తగూడెం: ఆగస్టు 31న జరిగిన రాష్ట్రస్థాయి బెంచ్ ప్రెస్ పోటీలలో 74కేజీల విభాగంలో భద్రాచలం సిటీ స్టెల్ జిమ్‌కు చెందిన డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ కాంస్య పతకం సాధించారు. ఆగస్టు 7వ తేదీన రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి జావలిన్ త్రో పోటీలలో ఎస్.కె.అమ్రిన్ బంగారు పతకం సాధించింది.ఈ పతకాలు సాధించిన ఇద్దరిని భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ అభినందించారు.