బ్యాటింగ్ వైఫల్యంతోనే తొలి టెస్టులో ఓడామని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ అన్నాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని.. కానీ బ్యాటింగ్ విభాగం రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. అశ్విన్, జడేజా అద్భుత భాగస్వామ్యంతో భారీ స్కోర్ చేసిందన్నాడు. తాము ఓడినా కొన్ని సానుకూలాంశాలు లభించాయని. తర్వాతి టెస్టులో తమ బ్యాటర్లు కూడా సత్తా చాటుతారని ఆశిస్తున్నట్లు తెలిపాడు.