బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్రస్తుతం టీమిండియా 71.67 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ 39.3 పాయింట్లతో ఆరో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 62.50 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. 3వ స్థానంలో న్యూజిలాండ్(50 పాయింట్లు), 4వ స్థానంలో శ్రీలంక(42.86), 5వ స్థానంలో ఇంగ్లాండ్(42.19) ఉన్నాయి.