నైజాం ఏరియాలో ఉదయాన్నే 4 గంటలకు “ఇళయతలపతి” విజయ్ నటించిన తాజా సినిమా “గోట్” (GOAT) బెనిఫిట్ షోలకు రంగం సిద్ధమైంది. సాధారణంగా విజయ్ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తమిళ నాట నటుడు కావడంతో, బెనెఫిట్ షోలు చెన్నై, తమిళనాడు ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా వేస్తుంటారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో GOAT సినిమాను Mythri Movie Makers తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. నైజం ప్రాంతంలో భారీ సంఖ్యలో బెనిఫిట్ షోల ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
Mythri Movie Makers CEO చిరంజీవి (చెర్రీ) “గోట్” ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఈ వార్త రెవీల్ చేసారు. హైదరాబాద్లో తమ ఉద్యోగాలు, వ్యాపారాలు వల్ల నివసిస్తున్న అనేక తమిళ ప్రజలు ఈ వార్త పండగనే చెప్పొచ్చు . విజయ్ గత చిత్రాలు, “లియో” , “బీస్ట్,” తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్ సాధించాయి. “గోట్” కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందిస్తుందని ఆశించవచ్చు.
GOAT విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత విడుదల కావడం గమనార్హం. విజయ్, తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తన రాజకీయ పార్టీ అయిన “తమిళగ వెత్రి కకళగం” తో సిద్ధంగా ఉన్నాడు. ఇది విజయ్ యొక్క రాజకీయ రీత్యా చివరి సినిమా కావచ్చు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, “గోట్” సినిమా మరింత ముఖ్యమైనది అని చెప్పవచ్చు.