విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌లో ప్రస్తుతం భారీ వరద ప్రవాహం నమోదైంది. ప్రస్తుతం బ్యారేజ్‌లో 11 లక్షల 20 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు సమాచారం. వర్షాలు కొనసాగితే, ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. పైన ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం వలన ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు చేరుతుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రకాశం బ్యారేజ్‌కు చెందిన 69వ గేటు పిల్లర్ కొంతమేరకు దెబ్బతింది. మూడు సాండ్ బోట్లు గేటు స్థలాన్ని ఢీకొట్టడం వలన ఈ నష్టం జరిగినట్లు సమాచారం. బ్యారేజ్‌లో నీరు సురక్షితంగా ప్రవహించేందుకు అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే దీని వాళ్ళ నష్టం లేదని, ప్రవాహం తగ్గిన వెంటనే మరమత్తులు చేస్తామని అధికారులు వెల్లడించారు. అధికారుల సూచనల ప్రకారం విజయవాడ వాసులు అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. మ్యాన్ హోల్స్, నీటితో నిండిన రోడ్ల నుండి దూరంగా ఉండాలని సూచించారు. ఈ పరిస్థుతిలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈ పరిస్థితిని క్రమంగా పర్యవేక్షిస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తూ, ప్రకాశం బ్యారేజ్ పరిస్థితిపై సమీక్ష జరుపుతున్నారు. తెల్లవారుఝాము 4 గంటల వరుకు చంద్రబాబు వరద పరిస్థితులను పర్యవేక్షిస్తు ఉన్నారు.