విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ పూజారులు మరియు ఆలయ సిబ్బంది కృష్ణమ్మా కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మా కృష్ణమ్మా మమ్ములను రక్షించు… అనుగ్రహించు… శాంతించు అమ్మా అంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కృష్ణ నదికి చరిత్ర యెరుగవు రీతిలో వరద పోటెత్తింది.. ఈ రోజు ఉదయం కృష్ణ నది వద్ద 11.25 క్యూసెక్ నీటి ప్రవాహం నమోదయ్యింది. 2009 తరువాత ఇదే హైయెస్ట్
ఈ విపరీతమైన ప్రవాహం కారణంగా కృష్ణలంక, అజిత్ సింగ్ నగర్, జుపుది, ఇబ్రహంపట్నం వంటి ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వరద నీరు సరిహద్దుల్ని మించిపోవడం, గృహాలను ముంచడం, ప్రజల ప్రాణాలను మరియు ఆస్తులను ముప్పు లోకి నెట్టడం వంటి సమస్యలు తలెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో గత 48 గంటల నుంచి విద్యుత్ లేదు, ఎటు చూసిన పాములతో భయబ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితిని అత్యంత చురుకైన దృష్టితో పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ అధికారులతో కలిసి ఆయన తక్షణ చర్యలను తీసుకుంటున్నారు, సహాయ చర్యలను సకాలంలో అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇంద్రకీలాద్రి ఆలయ పూజారులు కృష్ణ నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని తన భక్తులపై దయ చూపమని ప్రార్ధించారు .
ఈ పరిస్థితి త్వరలోనే మెరుగుపడాలని అందరూ ఆశిస్తున్నారు. వరదలు కారణంగా రైల్వే ట్రాక్స్ పూర్తిగా దెబ్బతినడం వలన విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే.