తెలుగులో ప్రముఖ హీరోలలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఎంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు. రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ “దేవర” పాట విడుదలైంది. నిజానికి ఈ పాట వినదానాయికి బాగానే ఉంది, మెలోడీ సాంగ్స్ మాస్ పాటలులాగా మొదటి నుంచి సూపర్ రెస్పాన్స్ రావడం చాలా అరుదు. వినగవినగా ఇవి ఆకట్టుకుంటాయి. చుట్టమల్లే సాంగ్ కూడా మొదటి రోజునే అన్ని భాషల వేషన్స్ కలిపి 20 మిలియన్ (2 కోట్లకు) పైగా వ్యూస్ వచ్చాయి.
కానీ, ఈ పాట విడుదలయ్యాక కొంతమంది రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో మార్ఫింగ్ తో కూడిన ట్రోలింగ్ పోస్ట్లు పెడుతూ వికృత ఆనందం పొందుతున్నారు. దుర్భాషలతో కామెంట్లు పెడుతూ పాటకు వ్యతిరేకంగా స్పందించారు.
ఇవి చూస్తున్న సినీ అభిమానులు ఇలాంటి వాతావరణం ఇండస్ట్రీ కి అంత మంచిది కాదని బాధ పడుతున్నారు. RRR లాంటి పాన్ ఇండియా సినిమా తో భారత దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేసిన హీరోలు. వారి అభిమానులు ఇలా గొడవలు పడుతుంటే చూడటానికి బాలేదు అంటూ కొంతమంది అంటున్నారు. ఈ ఇద్దరు హీరోలు RRR ప్రొమోషన్స్లో కూడా రాజమౌళి తో కలిసి అన్నదమ్ముల కలిసిపోయి పాల్గొన్నారు.