»Gold Silver Prices Fall By Up To Rs 4000 After Budget Cuts Custom Duty
Budget: బడ్జెట్ కస్టమ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత బంగారం, వెండి ధరలు రూ.4,000 వరకు తగ్గాయి
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
Gold, silver prices fall by up to Rs 4,000 after budget cuts custom duty
Budget: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. తాజా నిర్ణయంతో మార్కెట్లో బంగారం విలువ తగ్గడంతో వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది. అంతేకాదు బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6%కి తగ్గించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. ఇందులో ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (BCD) 10% నుంచి 5%కి తగ్గించారు. అలాగే అభివృద్ధి సెస్ (AIDC) 5% నుండి 1%కి తగ్గింది.
జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ హెడ్ హరీష్ వి మాట్లాడుతూ, “కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6%కి తగ్గించడం వల్ల దేశీయ ధరలు తగ్గవచ్చు, డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. గతంలో డ్యూటీలో 10% BCD, 5% AIDC ఉన్నాయి. ” అన్నారు. దాంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు రూ. 72,838 నుంచి 10 గ్రాములకు రూ.68,500కి పడిపోయింది. అంటే రూ.4,000 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో, బంగారం ధరలు ఔన్సుకు దాదాపు $2,397.13గా నమోదయ్యాయి. MCXలో వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి, కిలో రూ.88,995 నుంచి రూ.84,275కి పడిపోయాయి.
విఘ్నహర్తా గోల్డ్ లిమిటెడ్ చైర్మన్ మహేంద్ర లూనియా మాట్లాడుతూ.. “కస్టమ్స్ సుంకం తగ్గింపు త్వరగా మార్కెట్‌ను ప్రభావితం చేసింది. ఇది పెట్టుబడిదారులకు సానుకూల చర్య అయినప్పటికీ, చైనా వంటి దేశాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. వినియోగదారులకు, ధరల తగ్గుదల ఇప్పుడు ప్రయోజనకరంగా ఉందన్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చులు 2.5% వార్షిక వడ్డీని అందించే సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి డిజిటల్ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం అని పేర్కొన్నారు.”