»Cocaine Sharks Found In Brazil Scientist Unsure Where They Get The Drug
Cocaine Sharks : బ్రెజిల్ తీరపు షార్కుల్లో కొకైన్ ఆనవాళ్లు గుర్తింపు
బ్రెజిల్ తీరంలో దొరికిన షార్కు చేపల్లో కొకైన్ అవశేషాలను గుర్తించారు. కొన్ని చేపల్లో భారీ ఎత్తున మాదక ద్రవ్యాల ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ చదివేయండి.
Cocaine Sharks : మనిషి వినియోగిస్తున్న మాదక ద్రవ్యాల ప్రభావం సముద్ర జీవుల మీదా పడుతోంది. మూగ జీవాలకు ప్రాణాంతకం అవుతున్నాయి. సాధారణంగా దక్షిణ అమెరికా దేశాల్లో టన్నుల కొద్దీ కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడి అధికారులు ఏటా టన్నుల కొకైన్‌ని ఇక్కడ స్వాధీనం చేసుకుంటూ ఉంటుంది. ఇలా అధికారుల నుంచి తప్పించుకోవడానికి స్మగ్లర్లు రకరకాల మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. ఇలాంటి మాదక ద్రవ్యాల(Drugs) ప్యాకెట్లను సముద్రంలో వేసి సీక్రెట్‌గా స్మగ్లింగ్ చేస్తుంటారు.
అలా సముద్రంలోకి లీకైన కొకైన్ లాంటివి చేపలు సైతం తింటున్నాయి. అందుకనే బ్రెజిల్(Brazil) తీరంలో పట్టుకున్న షార్క్ చేపల్లో కొకైన్(Cocaine) ఆనవాళ్లు కనిపించాయి. అక్కడి తీరంలో చిన్న పడవల నుంచి 13 వైల్డ్ బ్రెజీలియన్షార్ప్నోస్ షార్క్ల్ని శాస్త్రవేత్తలు కొనుగోలు చేశారు. వీటికి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 13 చేపల్లోనూ కొకైన్ ఆనవాళ్లను గుర్తించి ఆశ్చర్యపోయారు. సముద్రంలో స్వేచ్ఛగా తిరిగే ఇలాంటి చేపల్లో కొకైన్ ఆనవాళ్లు ఉండటం వారిని దిగ్భ్రంతికి గురి చేసింది. వాటి కాలేయంలో కంటే కండరాల్లోనే మాదక ద్రవ్యాలు(Drugs) ఎక్కువగా ఉన్నాయి. ఇలా వీటిని సేవించడం వల్ల చేపల ప్రవర్తనలో ఏమైనా మార్పులు ఉంటాయా? అనే విషయంలో శాస్త్రవేత్తలు పరిశోధనల్ని తీవ్రతరం చేశారు.