Nirmala Sitharaman: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు 11 గంటలకు ప్రారంభమయ్యాయి. కేంద్రంలో ఎన్డీయే సర్కారు మూడోసారి కొలువుతీరింది. దీంతో తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో బడ్జెట్ సమర్పించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను ముందస్తుగా తెలిపేందుకు ఆర్థిక సర్వేను పార్లమెంట్‌కు సమర్పించింది.
Nirmala Sitharaman: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు 11 గంటలకు ప్రారంభమయ్యాయి. కేంద్రంలో ఎన్డీయే సర్కారు మూడోసారి కొలువుతీరింది. దీంతో తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో బడ్జెట్ సమర్పించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను ముందస్తుగా తెలిపేందుకు ఆర్థిక సర్వేను పార్లమెంట్‌కు సమర్పించింది. ఈ బడ్జెట్లో నిరుద్యోగ సమస్యతోపాటు ఇతర ప్రధాన అంశాలపై చర్చించనున్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఎకనమిక్ డివిజన్ సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పర్యవేక్షణలో ఈ ఆర్థిక సర్వే తయారు చేశారు.
గత సంవత్సరలో దేశ ఆర్థిక పనితీరును రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. దీన్ని ఆధారంగానే ఏటా కేంద్ర బడ్జెట్ రూపకల్పన ఉంటుంది. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. 1950-51 నుంచి యూనియన్ బడ్జెట్ తోపాటు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెట్టే వారు. అయితే, 1960వ దశకం నుంచి కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెడుతున్నారు.