BHPL: జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాలతో MRPS నాయకులు CJI గవాయి పై దాడిని ఖండిస్తూ, నిరసన చేపట్టారు. MRPS ఇన్ఛార్జ్ శ్యాంబాబు మాదిగ మాట్లాడుతూ.. ఈ నెల 7న CJI గవాయిపై దాడి చేసిన న్యాయవాది రాకేష్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ అశోక్‌కు వినతిపత్రం సమర్పించారు.