»Complaint Against Director Puri Jagannath In Medipalli Police Station
Puri Jagannath: డైరెక్టర్ పూరి జగన్నాథ్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ప్రముఖ డైనమిక్ డెరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ ఎనర్జిట్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గుస్సమీదున్నారు. ఈ మేరకు దర్శకుడు పూరి జగన్నాథ్‌పై పోలీసు స్టేషన్లో కేసులు నమోదు చేస్తున్నారు.
Complaint against Director Puri Jagannath in Medipalli Police Station
Puri Jagannath: ప్రముఖ డైనమిక్ డెరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ ఎనర్జిట్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గుస్సమీదున్నారు. ఈ మేరకు దర్శకుడు పూరి జగన్నాథ్‌పై పోలీసు స్టేషన్లో కేసులు నమోదు చేస్తున్నారు. దీనంతటికీ కారణం ఆ చిత్రంలోని ఒక ఐటెం పాటలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాటలను వాడారు. దీన్ని రాష్ట్రమంతా బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మార్ ముంత చోర్ చింత పాట మధ్యలో వచ్చే అయితే ఏం జేద్దామంటావ్ అనే కేసీఆర్ మాటలను వెంటనే తొలగించాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు మేడిపల్లి పోలీసు స్టేషన్లో పిటిషన్ ఇచ్చారు.
అశ్లీల పాటలో ఉద్యమనాయకుడి మాటలు పెట్టడంపై పలువురు విశ్లేషకులు సైతం మండిపడుతున్నారు. వెంటనే పాటలో కేసీఆర్ మాటలను తొలగించాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మేడిపల్లి బీఆర్ఎషస్ నాయకులు మాట్లాడుతూ.. 14 ఏళ్ల అంకుటిత దీక్ష, పట్టుదలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కెసిఆర్ మాటలను ఇలా ఐటమ్ పాట మధ్యలో పెట్టడం అవమానకరం అన్నారు. ఇది తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టే అని.. తక్షణమే ఆ మాటలను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ మధ్య కుర్చిని మడతబెట్టి అనే పాట ఎంత ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. కాలా పాషా అనే వ్యక్తి ఆ మాటలకు సోషల్ మీడియా వేదికగా అన్నారు. దాన్ని గుంటురుకారం అనే సినిమాలో వాడుకున్నారు. అదే తరహాలో కేసీఆర్ మాటలను కూడా వాడుకుందామని పూరి కనెక్ట్స్ టీమ్ భావించి ఉంటుంది. చిత్ర యూనిట్ ఉద్దేశం ఏదైనా.. ఒక ఉద్యమనాయుకుడి మాటలను ఐటమ్ సాంగ్‌లో పెట్టడంపైనే అభ్యంతారాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తుంది.