Amul milk: అమూల్ మిల్క్ ప్రొడక్ట్‌లో పురుగులు.. వీడియో వైరల్
తినే పదార్థాల్లో పురుగులు రావడం మధ్య ఎక్కువగా చూస్తున్నాము. మంచి పేరున్న బ్రాండ్ ప్రొడక్ట్‌లలో ఇలాంటి ఆహారం ఉండడం చూస్తుంటేనే జుగుప్సకరంగా ఉంటుంది. ఇప్పుడు అమూల్ మిల్క్ ప్రొడక్ట్‌లో కూడా పురుగులు దర్శనం ఇచ్చాయి.
Amul milk: బయట ఏదైనా తినాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హోటల్స్ మాత్రమే కాదు అత్యంత పటిష్టంగా ప్యాక్ చేసిన పదార్థాలు కూడా పరీక్షగా చూసుకొని తినాల్సిన పరిస్థితి. తాజాగా అమూల్ మిల్క్ ప్రొడక్ట్‌కు సంబంధించిన ప్యాకెట్లు పురుగులు దర్శనం ఇచ్చాయి. అధిక ప్రొటీన్ మజ్జిగతో పాటు పురుగులను కూడా అందిస్తున్నారా అని అమూల్ కంపెనీకి ఓ కస్టమర్ విననుత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తాను కొనుగోలు చేసిన బటర్ మిల్క్ ప్యాకెట్‌ను ఓపెన్ చేయగానే అందులో తిరుగుతున్న పురుగులు కనిపించాయి. వెంటనే వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ తిరుగుతుంది. నెటిజన్లు వీటిపై సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. అమూల్ కంపెనీ ఎంతో నమ్మకమైందని కానీ ఇలాంటి పురుగులను అందిస్తుంది అనుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు.
అమూల్ ప్రొడక్ట్ కొన్న ఒక కస్టమర్ తనకు ఎదరైన చేదు అనుభవాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తాను ఆన్లైన్ వేదికగా బటర్ మిల్క్ ఆర్డర్ చేసినట్లు తెలిపాడు. అయితే ఆర్డర్ వచ్చిన తరువాత ప్యాకెట్ తీసి చూసి షాక్‌కు గురయినట్లు వెల్లడించారు. అందులో తెల్లపురుగులు కనిపించడంతో కుటుంబం అంతా కంగుతిన్నామని ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాలుగున్నర లక్షల కన్న ఎక్కువ మంది చూశారు. దీంతో అమూల్ కంపెనీ స్పందించింది. కస్టమర్‌కు క్షమాపణలు చెప్పింది. ఇలాంటి ఘటన మరోసారి జరగకుంటా చూసుకుంటామని చెప్పింది. ఈ మధ్య ఆన్లైన్ ప్రొడక్ట్ మాత్రమే కాదు బయట ఆహార పదార్థాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయిని నెటిజన్లు అంటున్నారు.
Hey Amul you have sent us WORMS along with your high protien buttermilk.
I am writing to express my deep dissatisfaction after discovering worms in the buttermilk I purchased recently. This experience was incredibly….. pic.twitter.com/vmLC4rp89z