»Suryapet District Of Telangana Three People Including Software Died After Falling Into A Quarry Pit
Crime News: క్వారీ గుంతలో పడ్డ అమ్మాయిని కాపాడబోయి.. మొత్తం ముగ్గురు మృతి
క్వారీని చూసేందుకు వెళ్లిన పాప అందులో ప్రమాదవశాత్తు పడిపోయింది. పాపను కాపాడే క్రమంలో తన తండ్రి, అతని స్నేహితుడు క్వారీలో దిగారు. వాళ్లకు ఈత రాకపోవడంతో ముగ్గురు క్వారీలోనే చనిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలవరపాటుకు గురిచేసింది.
Suryapet district of Telangana, three people including software died after falling into a quarry pit
Crime News: క్వారీలో పడిన పాపను కాపాడే క్రమంలో ఇద్దరు వ్యక్తులు, పాప మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అందులో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నాడు. ఈ ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఇది చాలా విషదకరమైన సంఘటన అని స్థానికులు పేర్కొన్నారు. క్వారీ గుంతలో సాఫ్టువేర్ ఇంజినీర్, ఓ బిల్డర్, అతని కూతురు శవాలను చూసిన స్థానికులు కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనస్థిలికి వచ్చి పరీక్షించారు. జిల్లాలోని ఆత్మకూరు (ఎస్) మండలం బొప్పారంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రథామిక దర్యాప్తులో తెలిసిన విషయాలను మీడియాకు తెలిపారు.
శ్రీపాల్ రెడ్డి, రాజు ఇద్దరు స్నేహితులు హైదరాబాద్లో ఉంటున్నారు. శ్రీపాల్ రెడ్డి బిల్డర్, రాజు సాఫ్టువేర్ ఇంజినీర్ ఉన్నతమైన స్థానాల్లో ఉంటున్నారు. ఈ మేరకు మంగళవారం ఓ విందులో ఇద్దరూ పాల్గొన్నారు. బుధవారం ఉదయం శ్రీపాల్ రెడ్డి ఆయన కూతురితో సహా రాజును తీసుకొని బొప్పారంలో ఉన్న క్వారీని చూసేందుకు వెళ్లారు. వారు చుట్టు ఉన్న పరిసరాలను పరీక్షిస్తుండగా శ్రీపాల్ రెడ్డి కూతురు ప్రమాదవశాత్తు క్వారీలో పడిపోయింది. అందులో నీరు ఉండడంతో తనను కాపాడేందుకు శ్రీపాల్ రెడ్డి, రాజు దిగారు. ఎవరికీ ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.