»Elon Musk Elon Musk Helps Trump Every Month With Rs 376 Crores
Elon Musk: ట్రంప్ కోసం ఎలాన్ మస్క్ ప్రతినెలా రూ.376 కోట్లు సాయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన కోసం ప్రతినెలా దాదాపు 45 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.376 కోట్లు) ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
Elon Musk: Elon Musk helps Trump every month with Rs.376 crores
Elon Musk: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన కోసం ప్రతినెలా దాదాపు 45 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.376 కోట్లు) ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు లేదా బైడెన్‌కు తన వైపు నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం ఉండదని గతంలో మస్క్ ప్రకటించారు. అయితే మనసు మార్చుకున్న టెస్లా అధినేత ఇప్పటికే మాజీ అధ్యక్షుడి తరఫున ప్రచార కార్యక్రమాలకి విరాళం అందించారు.
కానీ ఇప్పటివరకు ఎంత ఇచ్చారన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు. తాజాగా ట్రంప్‌పై కాల్పుల ఘటనతో ఆయనకు పూర్తి మద్దతు మస్క్ ప్రకటించారు. ట్రంప్‌నకు మద్దతుగా ఏర్పాటైన కొత్త సూపర్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి జులై మొదలుకొని ప్రతినెలా 45 మిలియన్ డాలర్ల ఇవ్వాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఇది నిజమైతే మస్క్‌దే పెద్ద విరాళం. ఇప్పటివరకు ఈ సూపర్ ప్యాక్‌కు ప్రముఖ బ్యాంకర్ థామస్ మెలాన్ మునిమనవడు అత్యధికంగా 50 మిలియన్ డాలర్ల విరాళం అందించారు.