ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పట్టుబడ్డ వారికి టెస్టులు చేయగా అమన్ ప్రీత్‌కు పాజిటీవ్ వచ్చింది.
Shock for Rakul Preet Singh.. Aman Preet Singh's younger brother, who was arrested in a drug case, is positive.
Aman Preet Singh: ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. నార్సింగ్ పోలీసులు డ్రగ్స్‌తో పట్టుబడ్డ వారిని టెస్టులు చేయగా మొత్తం ఆరుగురికి పాజిటీవ్ వచ్చింది. అందులో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ 27 కింద ఏ6 గా చేర్చారు. నిందుతులకు వైద్యపరీక్షలు నిర్వహించి ఈ రోజు అందరినీ కోర్టులో హాజరు పరచనున్నారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. రకుల్ ప్రీత్‌ను ఉద్దేశించి పలువురు కామెంట్స్ పెడుతున్నారు. చాలా మంది నెటిజన్లు నెగిటీవ్‌గా కామెంట్స్ చేస్తున్నారు.
టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం పరిపాటి అయిపోయింది. ఎన్ని చర్యలు తీసుకున్నా దీన్ని అరికట్టలేకపోతున్నారు. డ్రగ్స్ సరఫరా ఆగడం లేదు. గతంలో కూడా చాలామంది స్టార్స్ విచారణ ఎదుర్కొన్నారు. అందులో పెద్ద హీరోలు, డైరెక్టర్లు ఉన్నారు. జూలై 15న సాయంత్రం కొంత మందిని నేరుగా డ్రగ్స్‌తో పట్టుకున్నారు. అందులో అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. పట్టుబడినప్పుడు అతని దగ్గర సుమారు 200 గ్రాముల కొకైన్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దాన్ని సీజ్ చేశారు. అమన్ ప్రీత్ సింగ్ ఒక సినిమాలో హీరోగా నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు.