Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని విస్మరించింది
సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని లేఖలో పేర్కొన్నారు.
Harish Rao: బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. బ్రాహ్మణులకు సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా విస్మరించారు, వాటిని కొనసాగించాలి అని కోరారు. తెలంగాణలోని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అగమ్యగోచరంగా తయారు అయిందని పేర్కొన్నారు. విద్య, ఉపాధి వంటి పథాకాలు నిలిపివేయడం బాధకరం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని ఎలా విస్మరిస్తుందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పాలనలో బ్రాహ్మణుల గౌరవాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకున్నామన్నారు. వారి సంక్షేమం కోసం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో రూ.12 కోట్లతో 10 ఎకరాల విస్తీర్ణంలో విప్రహిత బ్రాహ్మణ సదన్ నిర్మించామని పేర్కొన్నారు. బ్రాహ్మణ సంక్షేమం విషయంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నలిచిందని, ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహాలు అందడం లేదన్నారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో అసలు బ్రాహ్మణ పరిషత్ ఉందా? లేదా? అని ఆవేదన వ్యక్తం చేశఆరు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బ్రాహ్మణ సామాజికవర్గం చాలా ఆందోళనలో ఉన్నారని తెలిపారు. వీరి సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏటా రూ. 100 కోట్లు కేటాయించారని, ‘వివేకానంద’ పేరుతో విదేశీ విద్యా పథకం, ‘శ్రీ రామానుజ’ పేరుతో ఫీజు రీయంబర్స్మెంట్ పథకం అందించారు అని పేర్కొన్నారు. వేదపాఠశాలు, ఆచార్యులకు వేతనాలు ఇలా లక్షలాది బ్రాహ్మణుల ఇల్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగులు నింపిందన్నారు.