మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ మరొక్కసారి సమన్లు పంపింది. ఈ కేసులో జాక్వెలిన్‌ను ఇదివరకే చాలా సార్లు ఈడీ విచారించింది. తాజాగా మరోక్కసారి నోటీసులు జారీ చేసింది.
Jacqueline Fernandez: Money laundering case.. ED sent summons to Jacqueline once again
Jacqueline Fernandez: బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) ఓ మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) మరోసారి సమన్లు పంపింది. తన మాజీ ప్రియుడు సుకేష్ చంద్రశేఖర్ ఓ భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. రూ.200కోట్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సుకేష్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో భాగంగానే జాక్వెలిన్‌కు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు అవ్వమని ఆదేశించింది. ఇదే కేసులో గతంలో కూడా చాలా సార్లు విచారణకు హాజరయింది.
సుకేష్ చంద్రశేఖర్ రూ.200కోట్ల కుంభకోణం కేసులో జాక్వెలిన్‌ను కూడా ఈడీ నిందితురాలిగా చేర్చింది. అయితే తనను అరెస్టు చేయకుండా 2022లోనే మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. తరువాత పలుమార్లు విచారణకు పిలిచింది. తన ఆస్తులను ఈ కేసుకు అటాచ్ చేసింది ఈడీ. ముఖ్యంగా సుకేష్ తనకు రూ. 7 కోట్ల విలువైన ఆభరణాలు, వస్తువులను బహుమతిగా ఇచ్చాడనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా తన కుటుంబ సభ్యులకు కూడా ఖరీదైన కార్లు, బ్యాగులు, బట్టలు, వాచ్‌లు బహుమతితిగా ఇచ్చినట్లు ఈడీ ఆరోపించింది. రాన్‌బాక్సీ మాజీ బాస్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్‌ను సుకేష్ మోసం చేసిన విషయం తెలిసిందే. అదితి సింగ్ జైలులో ఉన్నప్పుడు తాను ప్రభుత్వ ఉన్నతాధికారిగా నటిస్తూ రూ.200 కోట్లు కుంభకోణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో సుకేష్ జైలులో ఉన్నాడు.