»Ashwin Explains The Reason For Splitting Kalki 2898 Ad Into Two Parts
Nag Ashwin : కల్కి పార్ట్2లో మరో కొత్త ప్రపంచాన్ని చూపిస్తా : నాగ్ అశ్విన్
విడుదలై వారం రోజులైనా కల్కి 2898 ఏడీ మానియా ఇంకా అలాగే ఉంది. ఈ నేపథ్యంలో కల్కి 2 గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడారు. మరో కొత్త ప్రపంచాన్ని అందులో చూపిస్తానని అన్నారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే?
Nag Ashwin : ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తున్న కల్కి 2898ఏడీ సినిమా వేడి ఇంకా తగ్గనేలేదు. అప్పుడే డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) పార్ట్2 గురించి అప్డేట్స్ ఇస్తున్నారు. ఇలాంటి సినిమాని తెరకెక్కించినందుకు డైరెక్టర్‌గా తనకు గర్వంగా ఉందన్నారు. అమితాబ్, కమలహాసన్, ప్రభాస్, దీపిక లాంటి స్టార్లతో ఇంత భారీ సినిమాని డైరెక్ట్ చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. శంకరపల్లిలో ఉన్న కల్కి సెట్స్‌లో ఆయన విలేకరులతో మాట్లడారు.
మొదట ఈ సినిమాని ఒకటే పార్ట్‌గా తెరకెక్కిద్దామని అనుకున్నానని నాగ్ అన్నారు. అయితే అంత కథని రెండు గంటల్లో చెప్పలేమని అనిపించిందని అన్నారు. అందుకనే పార్ట్2(part2) ప్లాన్ చేసినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన 20 రోజుల షూటింగ్ పూర్తయినట్లు తెలిపారు. ప్రభాస్ క్యారెక్టర్ సెడెండ్ పార్ట్‌లో మరింత హైలెట్ అవుతుందని చెప్పుకొచ్చారు. అలాగే అమితాబ్, కమలహాసన్‌ల పాత్రలు సైతం నెక్ట్స్ లెవెల్లో ఉంటాని అన్నారు. అలాగే సెకెండ్ పార్ట్ సినిమా తీయడానికి మరింత మాసివ్‌గా ప్లాన్ చేసినట్లు చెప్పారు. దీనిలో మరో కొత్త ప్రపంచాన్ని చూపిస్తానని హామీ ఇచ్చారు.
ఫస్ట్ పార్ట్‌లో కర్ణుడి పాత్ర ఇంకా అందరికీ అర్థం అయినట్లు లేదని అన్నారు. అందుకనే ఆ పాత్రపై విమర్శలు వస్తున్నాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాని రెండో సారి చూస్తే ఆ పాత్ర బాగా అర్థం అవుతుందంటూ చెప్పుకొచ్చారు. సెకెండ్ టైమ్ వర్త్ వాచ్ మూవీ కల్కి(Kalki 2898 Ad) అంటూ అన్నారు. తాను ఇంత పెద్ద సినిమాను తీయగలిగానంటే అది మేకర్స్ పుణ్యమేనని అన్నారు. వైజయంతీ మూవీస్ ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాని తీర్చిదిద్దడంలో సహకరించిందని హర్షం వ్యక్తం చేశారు.