టాల్కమ్ పౌడర్ వాడటం వల్ల మహిళల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. మరి రోజూ ఈ టాల్కమ్ పౌడర్ వాడితే ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో తెలుసుకుందాం.
Talcum Powder: సాధారణంగా చాలామంది టాల్కమ్ పౌడర్ వాడుతుంటారు. అయితే ఈ పౌడర్ వల్ల మహిళల్లో అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ తెలిపింది. జననాంగాలపై టాల్కమ్ పౌడర్‌ను తరచుగా వాడే మహిళల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ ప్రచురించింది. ఎక్కువగా ఈ పౌడర్ వాడే వాళ్లకి ప్రమాదం అధికంగా ఉంటుంది. ఇందులో ఆస్బెస్టాస్ అనే ఖనిజాన్ని వినియోగిస్తారు. ఇది క్యాన్సర్‌కు కారకంగా పనిచేస్తుందట. దీన్ని పీల్చినా కూడా ప్రమాదమే. ఆస్బెస్టాస్ లేని టాల్కమ్ పౌడర్‌తో పెద్దగా ప్రమాదం లేదు.
పొత్తి కడుపులోకి వ్యాపించే వరకు అండాశయ క్యాన్సర్‌ను గుర్తించడం కష్టమని వైద్యులు తెలుపుతున్నారు. పిల్లలు టాల్కమ్ పౌడర్ కణాలను పీల్చినట్లయితే అప్పుడు ఊపిరితిత్తులు, శ్వాసకోశ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. అండాశయ క్యాన్సర్ మహిళల్లో వస్తుంది. అండాలను విడుదల చేసే అండాశయంపై ఇది మొదట ప్రభావం చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా మూడు లక్షల మంది మహిళలు దాదాపుగా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతీ 87 మంది మహిళల్లో ఒకరికి ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని అధ్యయనాలు చెబుతున్నాయి.