Thane Teen Hangs : పిల్లలు ఈ మధ్య కాలంలో చాలా సెన్సిటివ్‌గా తయారవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యల వరకు ఆలోచించేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది ప్రాణాలనూ కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. పదహారేళ్ల వయసున్న ఓ బాలికను తండ్రి కోప్పడ్డారు. ఆమె కొత్తగా తన ఫోన్లో స్నాప్ఛాట్ని(Snapchat) డౌన్లోడ్ చేసుకుంది. దీంతో అది చూసిన తండ్రి ఆమెను సున్నితంగా మందలించారు. దీంతో ఆ బాలిక మనస్తాపానికి గురైతంది. క్షణికావేశంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఉదయం ఆమె గది తలుపులు ఎంత తట్టినా తీయలేదు. దీంతో ఇంట్లో వారికి అనుమానం వచ్చింది. తలుపులు బద్ధలుగొట్టి చూశారు. ఫ్యాన్‌కు ఉరేసుకుని(Hangs) ఆ బాలిక అప్పటికే విగత జీవిగా మారింది. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. స్నాప్ ఛాట్ (Snapchat) చూడొద్దని చెప్పినంత మాత్రాన చనిపోవడం దురదృష్టకరమని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. ఎలా ఆత్మహత్యకు పాల్పడిందన్న కోణంలో దర్యాప్తు చేశారు. ప్రమాద వశాత్తూ మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.