»Mobile Charger A Single Charger For All Mobile Phones
Mobile Charger: ఇకపై అన్ని మొబైల్ ఫోన్లకు ఒకే ఛార్జర్!
సాధారణంగా ఒక్కో ఫోన్‌కు ఒక్కో ఛార్జర్ ఉంటుంది. ఒక బ్రాండ్ ఛార్జర్ వేరే దానికి పెట్టడానికి సెట్ కాదు. అయితే మొబైల్ ఛార్జర్ విషయంలో కేంద్రం ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది.
Mobile Charger: A single charger for all mobile phones!
Mobile Charger: సాధారణంగా ఒక్కో ఫోన్‌కు ఒక్కో ఛార్జర్ ఉంటుంది. ఒక బ్రాండ్ ఛార్జర్ వేరే దానికి పెట్టడానికి సెట్ కాదు. ఇది యూజర్లకు పెద్ద సమస్యగా మారింది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది. ఏ బ్రాండ్ ఫోన్‌కి అయిన టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ ఉండే కేంద్రం ప్రయత్నిస్తుంది. దీనికోసం వచ్చే ఏడాది జూన్ వరకు డెడ్‌లైన్ విధించనున్నట్లు సమాచారం. అప్పటిలోగా స్మార్ట్ఫోన్ల కంపెనీలు అన్ని కొత్త ఉత్పత్తులను సీ టైప్ ఛార్జింగ్ పోర్ట్‌తో మాత్రమే తయారు చేయాలని తెలిపాయి.
భారత్‌లో మొదట ఈ నిబంధనను 2025 మార్చి నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ గడువును జూన్‌కు మార్చారు. 2026 చివరి నుంచి ల్యాప్‌టాప్‌లు కూడా సీ టైప్ ఛార్జింగ్ పోర్ట్‌తో తయారు చేసేలా నిబంధనను రూపొందించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వల్ల ఈ విధానం అమలులోకి తీసుకు రావాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.