Pensions : ఏపీలో పింఛన్ల పెంపుపై జీవో విడుదల.. ఏప్రిల్ నుంచే అమల్లోకి!
ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు... తదితరుల పింఛనును పెంచుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయవచ్చు.
Pension Hike In Andhrapradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పింఛన్లను రూ.4000కు పెంచుతూ సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు(Go) జారీ చేశారు. ఇక ఈ పింఛన్లు ‘ఎన్టీఆర్ భరోసా’ పేరుతో పేదలకు అందుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్య్సకారులు, డబ్బు కళాకారులు, హెచ్ఐవీ బాధితులు, హిజ్రాలు, ఒంటరి మహిళలు, కళాకారులు తదితరులకు రూ.3వేల పింఛన్ని అందిస్తున్నారు. ఆ పెన్షన్ ఇప్పుడు నాలుగు వేలకు పెరిగింది. పెరిగిన పెంక్షన్(Pension Hike) ఏప్రిల్ నెల నుంచి లెక్కగట్టి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూలై 1న వీరికి మూడు నెలల పెంచిన పింఛను సహా మొత్తం ఏడు వేల రూపాయలు అందిస్తామని తెలిపింది.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గురువారం పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. అందులో ఒకటి పింఛన్ల పెంపు. మిగిలినవి 16వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు లాంటి ఫైళ్లపైనా ఆయన సంతకాలు చేశారు.