గంజాయి సేవిస్తూ పోలీసులకు దొరికిపోయి.. ఆ మధ్య హాట్ టాపిక్ అయ్యాడు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్. ఈ మధ్య కాస్త సైలెంట్‌గా ఉన్న షన్ను ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు.
Shanmukh Jaswant: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ ఒక్కసారిగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. గంజాయి సేవిస్తూ షణ్ముఖ్ పోలీసులకు దొరికిపోయాడు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే.. తాను డ్రగ్స్‌కి అలవాటు పడటానికి డిప్రెషన్ కారణం అని.. ఇంటరాగేషన్‌లో చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడట. దీంతో.. షణ్ముఖ్ డిప్రెషన్‌కి దీప్తి సునైనతో బ్రేకప్ ఓ కారణం కావచ్చనే టాక్ కూడా నడిచింది. బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ పాల్గొన్నప్పుడు.. సిరితో వ్యవహారమే బ్రేకప్‌కు కారణమని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. బిగ్‌బాస్ హౌస్‌లో షన్నూ.. సిరితో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిన సంగతి తెలిసిందే. అయితే.. గంజాయి కేసు నుంచి బయటపడ్డ షన్ను.. ఇప్పుడు మళ్లీ యాక్టింగ్ పై ఫోకస్ పెట్టాడు. హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే మెయిన్ లీడ్‌గా పలు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ చేశాడు షణ్ముఖ్. అయితే.. పూర్తిస్థాయిలో మాత్రం సినిమాల్లో నటించలేదు. కానీ ఇప్పుడు హీరోగా ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు.
తాజాగా ఆ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమం కూడా జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్గా అనఘా అజిత్ నటిస్తోంది. పవన్ కుమార్ అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని షణ్ముఖ్ అఫీషియల్‌గా వెల్లడించాడు. ఈ సినిమాని శ్రీ అఖియన్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ స్క్రిప్ట్ అందించడం విశేషం. ఈ మూవీకి లీలా అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. మరి షన్ను హీరోగా సక్సెస్ అవుతాడేమో చూడాలి.