These Foods Can Increase Stress : ఇటీవల కాలంలో అంతా ఒత్తిడితో కూడిన జీవన విధానాన్ని గడుపుతున్నారు. దాని నుంచి ఎంత బయట పడాలన్నా పడలేక పోతున్నారు. జీవన విధానానికి తోడు కొన్ని ఆహారాలు( FOODS) సైతం మనలో ఒత్తిడిని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండటం అత్యవసరం అంటున్నారు.
ఎక్కువ చక్కెరలు ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతాయి. ఇక్కడ చక్కెరలు ఎక్కువగా ఉన్నవి అంటే స్వీట్స్ అనే అర్థం మాత్రమే కాదు. పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలని మనం అర్థం చేసుకోవాలి. వీటిని తినడంవల్ల ఒత్తిడి(STRESS), చిరాకు ఇంకా అధికం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రోసెస్డ్ ఫుడ్స్ని ఎంత దూరం పెడితే అంత మంచిది. ఏ ఆహారాన్ని అయినా అది ఎలా సహజంగా లభ్యం అవుతోందో అలా తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. అంతే కాని దాన్ని ప్రోసెస్ చేసి, నిల్వ చేసినవి తినడం వల్ల అనారోగ్యాలు కలిగే అవకాశాలే అధికం.
ఆర్టిఫిషియల్ స్వీటనర్లు వేసి తయారు చేసిన ఆహారాలు, రిపైండ్ నూనెలు, వాటితో చేసిన పిండి వంటలు, వేపుళ్లు లాంటివి తీసుకోవడం వల్ల కూడా మనలో ఒత్తిడి(STRESS) పెరుగుతుందట. చాలా మంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. అయితే వీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కెఫీన్ పెరిగిపోతుంది. దీని వల్ల నిద్రలేమి సంభవిస్తుంది. ఆ ఫలితంగా మళ్లీ మనలో ఒత్తిడి(STRESS) ఎక్కువ అవుతుంది. అందుకనే వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండటమే మంచిది.